రహదారిపై అడ్డంగా పడి ఉన్న భారీ వృక్షాన్ని తొలగించిన జనసైనికులు

రంపచోడవరం డివిజన్: వై రామవరం మండలం నందు పనసల పాలెం, చవిటి దిబ్బల గ్రామాల మధ్యలో భారీ గాలి, వాన, వడగలుతో పడిన వర్షం కారణంగా భారీ వృక్షం పడటం వలన రహదారిపై వచ్చిపోవు వాహనాలకు మరియు ప్రయాణికులకు అంతరాయం కలుగుతుందని ఇరువురి ద్వారా తెలుసుకున్న జనసేన మండల అధ్యక్షుడు పుష్పరాజ్ ద్వారా తక్షణమే ఆ స్థలానికి చేరుకుని వెంటనే తమ జనసైనికులకి ఫోన్ ద్వారా సమాచారాన్ని అందించి దగ్గరుండి ట్రాఫిక్ అంతరాయాన్ని తమ తమదైన అభిమానంతో తొలగించారు. అంతేకాకుండా మండల అధ్యక్షుడు మరియు కార్యకర్తలు మాట్లాడుతూ మాది రాజకీయం కాదు సేవా కార్యక్రమాలు అని తెలియజేశారు. ఇందుకు ఇరువైపులా ఉన్న ప్రయాణికులు వై రామవరం మండల జనసేన సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు వై రామవరం మండల జనసేన అధ్యక్షుడు పుష్ప రాజ్ మరియు కార్యకర్తలు బి వెంకటరెడ్డి, కుప్ప శ్రీను, కే లక్ష్మణ రెడ్డి, కె సూర్యనారాయణ, పి రాంబాబు, పి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment