వారాహి యాత్ర విజయవంతం కావాలని సర్వమత ప్రార్ధనలు

ఏలూరు: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జూన్ 14 వ తేదీన చేపట్టబోయే వారాహి యాత్ర విజయవంతం కావాలని ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు ఆధ్వర్యంలో సర్వమత ప్రార్థనలు ఘనంగా నిర్వహించడం జరిగింది. తొలుత 40 వ డివిజన్ మీసాల అప్పన్న స్వామి దేవాలయం మరియు అవిముక్తేశ్వర స్వామి దేవాలయం లో 101 కొబ్బరికాయలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే కోటదిబ్బ లోని దర్గ లో ప్రత్యేక ప్రార్థనలు చేయించి ఆ అల్లా వారి నమాజులో పాల్గొన్నారు. అనంతరం హనుమాన్ నగర్ సుందరయ్య కాలనీ లో ఉన్న గ్జేవీయర్ చర్చిలో మత పెద్దలు గురుజనులతో ప్రత్యేక ప్రార్థనలు చేయించారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పల నాయుడు మాట్లాడుతూ ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టడమే వారాహి యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశ్యం అని అన్నారు. ఈ రాక్షస పాలనను అంతం చేసి పవనన్న ప్రజా పాలనను చేపట్టాలని కోరుతూ మంగళవారం ప్రత్యేక పూజలు ప్రత్యేక ప్రార్థనలు చేయడం జరిగిందని తెలిపారు. ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ 14 వ తేదీ నుండి అన్నవరం సత్యనారాయణ స్వామి వారి సన్నిధి నుండి వారాహి యాత్ర జరుగుతుంది. ఎటువంటి అవాంతరాలు లేకుండా యాత్ర సజావుగా జరగాలని ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ నుండి కోరుతున్నామని తెలిపారు. ఈ పూజ కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్క జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు వీర మహిళలు ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్, ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, కావూరి వాణిశ్రీ, ఫ్యాన్స్ ప్రెసిడెంట్ దోసపర్తి రాజు, అధికార ప్రతినిధి అల్లు సాయి చరణ్, కార్యదర్శి బొత్స మధు, 1 టౌన్ మహిళ ప్రెసిడెంట్ కోలా సుజాత, 2 టౌన్ మహిళ సెక్రటరీ తుమ్మపాల ఉమాదుర్గ, నాయకులు బుధ్ధా నాగేశ్వరరావు, బోండా రాము నాయుడు, రెడ్డి గౌరీ శంకర్, వీరంకి పండు, హరీష్, బాలు, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.‌