పట్టభద్రుల సమస్యలను పరిష్కరిస్తా: వాణీదేవి

హైదరాబాద్: రంగారెడ్డి, మహబూబ్‌నగర్, హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో విజయం సాధించడంతో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ సురభి వాణీదేవి హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం పీవీ ఘాట్‌లో నివాళులర్పించారు. ఈసందర్భంగా వాణీదేవి మాట్లాడుతూ.. పట్టభద్రుల సమస్యలను పరిష్కరిస్తానని చెప్పారు. తనను గెలిపించినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొంటానని వాణీదేవి పేర్కొన్నారు.