నందిగామ రైతుల సమస్యను పరిష్కరించండి

*శ్రీమతి తంబళ్ళపల్లి రమాదేవికి అనాసాగరం గ్రామ రైతుల వినతిపత్రం

నందిగామ పట్టణంలోని 20వ వార్డు అనాసాగరం శివారుల్లో జాతీయ రహదారి ఎన్ హెచ్-65, 6 లైన్ రోడ్ నిర్మాణం కోసం తీసుకున్న భూములకు నష్టపరిహారం అందకపోవడం రైతులకు తీవ్ర కష్టాలను కలిగిస్తోంది. ఈ సమస్యను పరిష్కరించాల్సిందిగా నందిగామ నియోజకవర్గ జనసేన సమన్వయకర్త శ్రీమతి తంబళ్ళపల్లి రమాదేవికి అనాసాగరం గ్రామ రైతులు వినతిపత్రం అందజేశారు. గత వైసీపీ ప్రభుత్వం సర్వే నిర్వహించి రైతుల పంట పొలాలు, చొప్పదొడ్లు భూములను తీసుకుని, నిర్ణయించిన ధరకే నష్టపరిహారం అందిస్తామని హామీ ఇచ్చినప్పటికీ, నాలుగు సంవత్సరాలు గడిచినా ఎలాంటి పరిహారం అందలేదని రైతులు వాపోయారు. ఈ సమస్యను పరిష్కరించగలది జనసేన మాత్రమే అని నమ్మకం వ్యక్తం చేస్తూ, ఇప్పటికే విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్‌ను పలుమార్లు సంప్రదించినప్పటికీ, ఇప్పటికీ పరిష్కారం రాలేదని తెలిపారు. వినతిపత్రాన్ని స్వీకరించిన తంబళ్ళపల్లి రమాదేవి మాట్లాడుతూ, ఈ సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి, నష్టపరిహారం అందేలా పోరాడతానని భరోసా ఇచ్చారు. జనసేన అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు గతంలో అనేక ప్రజా సమస్యలపై పోరాడి, నష్టపోయిన వేలాది మందికి అండగా నిలిచిన నాయకుడని, తాను కూడా ప్రజల కోసం పని చేయడమే తన లక్ష్యమని తెలిపారు. రైతులు అధైర్య పడవద్దని, వారి హక్కుల కోసం జనసేన అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ మురళీకృష్ణ, అడపా రాము, కొమ్మినిడి సత్యనారాయణ, మెల్లంపూడి జగదీశ్వరావు, వంకెన గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment