19వ డివిజన్ లోని సమస్యలను పరిష్కరించండి.. మున్సిపల్ కమీషనర్ కు జనసేన వినతి పత్రం

ఏలూరు నియోజకవర్గంలోని 19వ డివిజన్ లోని సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గురువారం మున్సిపల్ కమీషనర్ కు పశ్చిమ గోదావరి జిల్లా అధికార ప్రతినిధి ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ శ్రీ రెడ్డి అప్పల నాయుడు వినతిపత్రాన్ని అందజేసారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏలూరులో ఈ నెల 6 మరియు 7 వ తేదిన జనసేన పార్టీ నిర్వహించిన ప్రజా సమస్యలపై జనసేన పోరుబాట అనే కార్యక్రమంలో స్థానిక 19వ డివిజన్లో కొత్తూరు ఇందిరమ్మ కాలనీలో స్థానిక ప్రజలు ఎదురుకొంటున్న అనేక సమస్యలు మా దృష్టికి తీసుకురావడం జరిగిందని వాటి వివరాలు మీకు తెలియపరుస్తున్నాము.. కొత్తూరు పెదపాడు ఋ&భ్ రోడ్డు నుండి 19 వ డివిజన్ ఇందిరమ్మ కాలనీ ఫేజ్ 1&2 ప్రధాన రహదారి మరియు కాలనీ రోడ్లు పెద్ద పెద్ద గోతులతో ఉన్నవి.. ఈ రహదారిలోనే కాలనీ వాసులు నిత్యం ప్రయాణం సాగిస్తున్నారు.. అత్యవసర సమయాల్లో లేక హాస్పిటల్ వెళ్ళడానికి స్థానిక ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు.. సిసి రోడ్లు వేయకపోయినా కనీసం మెటల్ రోడ్డువేసి స్థానిక ప్రజల సమస్యను పరిస్కరించండి.. అలాగే కులాయి పంపు కనెక్షన్లు అనధికారికంగా రూ.6000/- వసూలు చేస్తున్నారు.. కులాయి కనెక్షన్లు ఉచితంగా ఇవ్వాలని జనసేనపార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాము.. కాలనీ దారి పొడవున వీధి దీపాలు సమకూర్చాలని రాత్రి వేళల్లో పాముల బెడద నుండి ప్రజలను కాపాడాలని కోరుతున్నాము.. కాలనీ లో డ్రెయిన్ నిర్మాణం పూర్తి చేయాలి.. అలాగే డ్రెయిన్ కీ రోడుకి కనెక్టింగ్ రోడ్లు నిర్మాణం చేయాలి.. కాలనీ వాసుల కోసం ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణానికి అన్ని అనుమతులు వచ్చినా ఎటువంటి పనులు ప్రారంభం కాలేదు.. వెంటనే ట్యాంక్ నిర్మాణం పనులు చేపట్టాలని జనసేన పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాము.. ఏలూరు జ్యూట్ మిల్లు వద్ద ఉన్న ఫ్లైఓవర్ బ్రిడ్జి ఫుట్ పాత్ పై ఏర్పాటు చేసిన కుండీలు పాదచారులకు అసౌకర్యంగా ఉన్నందున మరియు వంతెన చాలా పాతది అయినందున ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.. కావున కుండీలను తొలగించాలని జనసేన పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాము.. ఈ సమస్యలు అన్నీ పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు మున్సిపల్ కమీషనర్ గార్కి వినతిపత్రాన్ని అందజేయడం జరిగింది అని అన్నారు.. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ శిరిపల్లి ప్రసాద్, నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్, అధికార ప్రతినిధి అల్లు సాయి చరణ్, కార్యదర్శి కందుకూరి ఈశ్వరరావు, దావూద్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.