సాయిప్రతాప్ కాలనీ వాసుల సమస్యలు తీర్చండి: రామ శ్రీనివాసులు

అన్నమయ్య జిల్లా, టీ సుండుపల్లి మండలంలోని రాయవరం గ్రామంలో.. జనసేన పార్టీ నాయకులు రామ శ్రీనివాసులు మాట్లాడుతూ.. రాయవరం, పించ క్రాస్ మధ్యలో ఉన్న సాయిప్రతాప్ కాలనీలో ఉన్నటువంటి 20 కుటుంబాల నివాసితుల.. సమస్యలను వివరిస్తూ.. రహదారి సంబంధిత అధికారులు ఇక్కడ స్పీడ్ బ్రేకర్, హెచ్చరిక బోర్డ్, ప్యాసంజర్ల సౌకర్యాలను దృష్టిలో పెట్టుకొని ఆర్.టీ.సీ.బస్ లు ఆపడానికి బస్ స్టాప్ తక్షణమే ఏర్పాట్లు చేయాలని అభ్యర్థిస్తూ.. అలాగే నిత్యం వాహనాలు రద్దీగా తిరిగే రహదారిలో 20 రోజుల వ్యవధిలో సుమారు 8 పైన ప్రమాదాలు జరిగాయి. ఇక్కడ నుండి 100 మీటర్ల దూరంలో ఉన్న పిహెచ్ సీ ప్రభుత్వ ఆసుపత్రి సిబంది ద్వారా ఎంక్వయిరీ జరిపి ఆ సమస్యలు గుర్తించి సంబంధిత అధికారులు తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు.