ఆవిర్భావ దినోత్సవ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన సోమరౌతు అనూరాధ

పిఠాపురం నియోజకవర్గం చిత్రాడలో ఈనెల 14న నిర్వహించనున్న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభను విజయవంతం చేయాలని ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి సోమరౌతు అనూరాధ పిలుపు ఇచ్చారు. వేమూరు నియోజకవర్గం కాకర్లమూడి గ్రామంలో జనసేన పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఛలో పిఠాపురం అనే కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మార్చి 14న జరగనున్న జనసేన పార్టీ ఆవిర్భావ సభకు సంబంధించి గోడ పత్రికలను విడుదల చేసి అవిష్కరించారు. అనంతరం అనూరాధ మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేస్తున్న సేవలను దేశవ్యాప్తంగా కొనియాడారు. ఆయన తన సొంత నిధులతో సేవా కార్యక్రమాలు చేస్తూ, ఎంతో మందికి స్ఫూర్తిదాయకులయ్యారని పేర్కొన్నారు. సినిమాలలో వచ్చే కోట్లాది రూపాయల ఆదాయాన్ని త్యజించి పేద ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పంతో, తప్పు చేసే వారిని ప్రశ్నించాలనే తత్వంతో జనసేన పార్టీ ఆవిర్భవించిందని అనూరాధ చెప్పారు. ఈనెల 14న పిఠాపురంలో జరిగే పార్టీ ఆవిర్భావ సభకు లక్షలాది మంది జనసైనికులు, వీర మహిళలు పాల్గొనే అవకాశం ఉందని, అందరూ క్షేమంగా వచ్చి, క్షేమంగా తిరిగి వెళ్లాలని పవన్ కళ్యాణ్ సూచించారని తెలిపారు. ఈ సభను విజయవంతం చేయాలని అనూరాధ కోరారు. ఈ కార్యక్రమంలో చందు చంద్రశేఖర్ (యూఎస్ఏ), చందు శ్రీనివాసరావు (యూఎస్ఏ), చందు రాఘవయ్య, బొల్లిమంత వెంకటేశ్వరరావు, కాళిదాసు కోటేశ్వరరావు, శ్రీనివాసరావు, సత్యనారాయణ, నాని, నాగరాజు, అంకమ్మరావు, 200 మంది జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.

Share this content:

Post Comment