హీరోగా ఎంట్రీ ఇస్తున్న సుమ-రాజీవ్ కనకాల తనయుడు

తెలుగు లోగిళ్లలో తన మాటల గలగలతో అందరికీ చేరువైన ప్రముఖ యాంకర్ సుమ కనకాల, నటుడు రాజీవ్ కనకాల తనయుడు రోషన్ హీరోగా పరిచయం కాబోతున్నాడు. గతంలో రోషన్ పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించాడు. ఇపుడు కథానాయకుడిగా పరిచయం కాబోతున్నాడు. ఈ ఆదివారం రోషన్ తొలి చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లోని ఒక దేవాలయంలో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఈ మేరకు రాజీవ్ కనకాల వీడియోను షేర్ చేశాడు.

రోషన్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుటపెట్టడం సంతోషంగా ఉందని తెలిపారు రాజీవ్ కనకాల. రోషన్‌కు ఇది డెబ్యూ చిత్రం కాగా ఈ సినిమాతో విజయ్ తెలుగు తెరకు దర్శకుడిగా పరిచయం కానున్నారు. జేబీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తుండగా అతి త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ సినిమా టీంని తప్పక ఆదరించాలని రాజీవ్ కోరారు.