సెల్ ఫోన్లు పంచిన సోనూ సూద్

ఎముకే లేదన్నట్టుగా పెద్దమనసుతో దాతృత్వ కార్యక్రమాలు చేపడుతున్న ప్రముఖ నటుడు సోనూ సూద్ మరోసారి వార్తల్లోకెక్కారు. సోనూ సూద్ మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో వస్తున్న ఆచార్య చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ఆచార్య యూనిట్ లో కార్మికులకు ఉచితంగా సెల్ ఫోన్లు అందజేశారు. ఆర్థికంగా వెనుకబడిన కార్మికులను గుర్తించి 100 సెల్ ఫోన్లు కానుకగా బహూకరించారు. సోనూ సూద్ నుంచి మొబైల్ ఫోన్లు అందుకున్న ఆ కార్మికులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సెట్స్ పై సందడి వాతావరణం నెలకొంది