విజయవాడలో సోనూసూద్‌ సందడి

విజయవాడలో ప్రముఖ సినీనటుడు సోనూసూద్‌ సందడి చేశారు. నగరంలోని పాలీక్లినిక్‌ రోడ్డులో అంకుర ఆస్పత్రిని ఆయన ప్రారంభించారు. ఇప్పటికే ఆ ఆస్పత్రికి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న సోనూసూద్‌.. ఈ క్రమంలోనే ఆస్పత్రి ప్రారంభోత్సవానికి వచ్చారు. ఆయన్ను చూసేందుకు భారీగా అభిమానులు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. సోనూసూద్‌ రియల్‌ హీరో అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.