గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో సోనూ సూద్

జాతీయస్థాయిలో వేలాది మంది వలస కూలీలను ఆదుకోని రియల్ హీరోగా మారిన సోనూ సూద్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నారు.  రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన 3వ విడత గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా సోమవారం రామోజీ ఫిలిం సిటీలో సోనూ సూద్ మొక్కలు నాటారు. ప్రముఖ సినీ దర్శకుడు శ్రీను వైట్ల ఇచ్చిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి తాను ఈరోజు మొక్కలు నాటినట్లు తెలిపారు సోనూసూద్.

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆలోచనకు శ్రీకారం చుట్టడం చాలా సంతోషంగా ఉంది. కరోనా, తదనంతర కాలంలో పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకత పెరిగిందన్నారు. చెట్లు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అనీ, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో నేను ఒకరిగా పాల్గొన్నందుకు ఆనందంగా ఉందని సోనూ అన్నారు. ఇదే స్ఫూర్తితో లక్షలాది మంది గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరిస్తూ మొక్కలు నాటాలని, పర్యావరణాన్ని పరిరక్షించాలని సోనూ సూద్ పిలుపునిచ్చారు.