ప్రొఫెషనల్ తరహాలో కత్తులకు పెడుతున్న సోనూ సూద్… వీడియో

లాక్ డౌన్ సమయంలో ఆపన్నుల పాలిట ఆపద్బాంధవుడిలా మారిన నటుడు సోనూ సూద్ ఇప్పుడేం చేసినా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తాజాగా ఆయన కత్తుల సానబెట్టే సైకిల్ పై తన ప్రావీణ్యాన్ని ప్రదర్శించారు. ఎంతో హుషారుగా కత్తులకు పదును పెడుతూ దర్శనమిచ్చారు. ఎంతోకాలం నుంచి ఆ పని చేస్తున్నవాడిలా నైపుణ్యంతో కత్తులు నూరారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట అందరినీ ఆకర్షిస్తోంది. ‘మీ ఫిట్ నెస్, మీ వృత్తి చేయి చేయి కలిపి నడిస్తే ఇలా ఉంటుంది’ అంటూ తన వీడియోకు క్యాప్షన్ కూడా జత చేశారు.