దుర్గామాత మండపంలో సోనూ సూద్‌ నిలువెత్తు విగ్రహం

కరోనావైరస్ కారణంగా విధించిన లాక్‌డౌన్ కాలంలో వలస కార్మికుల కష్టాలను తన కష్టాలుగా భావించిన బాలీవుడ్ నటుడు సోనుసూద్ దేశవ్యాప్తంగా ఎంతో మందిని ఆదుకొన్నారు. వలస కార్మికులు స్వస్థలాలకు వెళ్లేందుకు బస్సు సౌకర్యం కల్పించి.. వారి పాలిట దేవుడిగా మారిన సినీనటుడు సోనూ సూద్‌పై కోల్‌కతా వాసులు తమ కృతజ్ఞతను గొప్పగా చాటుకున్నారు. దుర్గామాత నవరాత్రి ఉత్సవాల కోసం ఏర్పాటు చేసిన మండపంలో సోనూ సూద్‌ విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు. ప్రఫుల్లా కనక్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సోనూ సూద్‌ విగ్రహాన్ని, ఆ పక్కనే వలస కార్మికులను తీసుకెళ్లేందుకు తెప్పించిన బస్సును ఏర్పాటు చేశారు. ఈ ఫొటోను ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. సోనూ సూద్‌ దీనిని రీ పోస్ట్‌ చేస్తూ.. ‘ఇది నా జీవితంలో లభించిన అతిపెద్ద పురస్కారం’ అని తెలిపారు.