గవర్నర్ తమిళిసైని కలిసిన స్పీకర్ పోచారం

రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్‌ను శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. తమిళిసై సౌందర్ రాజన్ తెలంగాణ గవర్నర్‌గా నేటితో రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆమెకు పోచారం శ్రీనివాస్ రెడ్డి, అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచార్యలు శుభాకాంక్షలు తెలిపారు.