టీవీ, సినిమా షూటింగ్స్‌ చేసే వారికి ప్రత్యేక రాయితీలు

టీవీ, సినిమా షూటింగ్స్‌ చేసే వారికి తెలంగాణా ప్రభుత్వం ప్రత్యేక రాయితీలు కల్పించింది అని మంత్రి తలసాని చెప్పారు. తెలంగాణాలో ఎన్నో అద్బుతమైన లొకేషన్స్‌ ఉన్నాయన్నారు. ఇక్కడి లొకేషన్స్‌లో సినిమాలు తీస్తే భారీగా బడ్జెట్‌ తగ్గుతుందని పేర్కొన్నారు. సింగిల్‌ విండో సిస్టంతో షూటింగ్‌లకు అనుమతి ఉంటుందని తెలిపారు. షూటింగ్స్‌ వల్ల రాష్ట్రం టూరిజం అభివృద్ధి చెందుతుందన్నారు. త్వరలో షూటింగ్స్‌పై ప్రత్యేక విధానాన్ని అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.