శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జనసేన ప్రచార రథంకు ప్రత్యేక పూజలు

శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా ఎన్నికల ప్రచారానికి అన్ని హంగులతో మినీ వారాహీ పేరుతో ఒక ప్రత్యేక వాహనాన్ని తయారు చేసి, మంగళవారం నియోజకవర్గంలోని వేడం గ్రామంలో వెలసిన ప్రసిద్ది గాంచిన శ్రీ కాళికాదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమంలో నియోకవర్గ నాయకులు, వీరమహిళలు, జనసైనికులు పాల్గొన్నారు. పూజ అనంతరం ఆలయం నుండి నియోజకవర్గ కేంద్ర పార్టీ కార్యాలయంకు ప్రచార రథంను తీసుకెళ్లడం జరిగింది.