కొవ్వూరు నియోజకవర్గం, ఐ.పంగిడిలో జనసేన నాయకులు అంతా పవన్ కళ్యాణ్ చిన్న కూమారుడు మార్క్ శంకర్ కు ఆరోగ్యంగా ఉండాలని ఐ.పంగిడి స్వయంభు శ్రీ ఉమా అక్షయ రామలింగేశ్వర స్వామి వారికి అభిషేకం చేయటం జరిగింది. అలాగే అడవిబాట కార్యక్రమంలో ఉండగా సింగపూర్ లో చదువుతున్న చిన్న కూమారుడుకు స్కూల్ నందు అగ్ని ప్రమాదం జరిగందని తెలిసినా సరే గిరిజన ప్రాంతాల్లో రోడ్లు శంఖుస్థాపన కార్యక్రమం, అలాగే గిరిజనలతో రక్షబండ కార్యక్రమం షెడ్యూల్ ను యధాతధంగా జరగాలని అదికారులకు ఆదేశాలు ఇచ్చి మన కోసం ఎదురు చూస్తున్న ప్రజలకు ఇచ్చిన మాట కోసం గిరిజనులు వద్దకు వెళ్ళటం జరిగింది. అక్కడ ప్రజలు పవన్కళ్యాణ్ ని దేవుడులా పూజించటం జరిగింది. మీ అందరి ఆశీస్సులు నా బిడ్డకు ఉంటాయి. అనే సంకల్పంతో షెడ్యూల్ పూర్తి అయిన తరువాత సింగపూర్ వెళ్ళటం జరిగింది. ఇలాంటి ప్రజా నాయకుడుకు, వారి కుటుంబానికి స్వయంభు శ్రీ ఉమా అక్షయ రామలింగేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఉండాలని ఐ.పంగిడి గ్రామాధ్యక్షులు వాసిరెడ్డి వేంకటేష్ కన్నప్ప, కొప్పాక విజయ్ కుమార్, పెరుగు శివ, పూటి జగదీష్, మడిచర్ల నాగరాజు స్వామి, నాగేంద్ర మొదలైన వారు అభిషేకం చేయటం జరిగింది.
Share this content:
Post Comment