శ్రీశ్రీశ్రీ దుర్గా దేవి, వీరాంజనేయస్వామి, సాయిబాబా ఆలయాలలో ప్రత్యేక పూజలు

సింగపూర్ స్కూల్ అగ్ని ప్రమాదంలో గాయపడ్డ కొణిదెల మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలంటూ శృఒగవరపు కోట నియోజకవర్గం, కొత్తవలస మండలంలో శ్రీశ్రీశ్రీ దుర్గా దేవి అమ్మవారు, వీరాంజనేయస్వామి, సాయిబాబా ఆలయాలలో కుంకుమ , సింధూర, బాబా హారతి పూజలు నిర్వహించిన జనసేన శ్రేణులు. శ్రీశ్రీశ్రీ దుర్గా దేవి అమ్మవారు, వీరాంజనేయస్వామి, సాయిబాబా దయతో మంచి మనసుతో ప్రజలు అందించే ఆశీర్వాదాలతో మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని అభిలాషించిన జనసేన పార్టీ కొత్తవలస మండలం నాయకులు పిల్లా రామ్ దుర్గ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న జిల్లా ప్రచార కార్యదర్శి మల్లువలస శ్రీను, కొత్తవలస మండలం అధ్యక్షులు గాలి అప్పారావు, మండలం ప్రధాన కార్యదర్శి లు, రామ్ దాస్ కాశీ, బంధం సత్యనారాయణ, జిన్నాల శ్రీను, కార్యదర్శిలు బోర శ్రీను, అంగి కోటేశ్వరరావు, జనసేన నాయకులు లెంక వరహాలు, రాజు మరియు ఆలయ పూజారులు, మండలం నాయకులు, జనసైనికులు పాల్గొనడం జరిగినది.

Share this content:

Post Comment