కాకినాడ రూరల్ నియోజకవర్గం ఇంద్రపాలెం గ్రామంలో, జనసేన పార్టీ పి.ఏ.సీ సభ్యులు, ఎమ్మెల్యే పంతం నానాజీ ఆదేశాల మేరకు శ్రీశ్రీశ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి ఆలయంలో పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు చిరంజీవి మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సింగపూర్ అగ్ని ప్రమాదంలో గాయపడ్డ కుమారుడి విషయాన్ని తెలిసినా, గిరిజనులకు ఇచ్చిన మాట నెరవేర్చేందుకు అడవి తల్లి బాట కార్యక్రమాన్ని పూర్తి చేసి తరవాతే సింగపూర్‌కు బయలుదేరిన పవన్ కళ్యాణ్ నాయకత్వం పట్ల నాయకులు, అభిమానులు గర్వావేశంతో స్పందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్ చేసి ధైర్యం చెప్పినట్లు తెలియజేశారు. పవన్ కళ్యాణ్ గారి సైన్యంలో భాగమవడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నట్లు జనసేన శ్రేణులు పేర్కొన్నారు.
Share this content:
Post Comment