గుంతకల్:గుంతకల్ పట్టణంలోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో జనసేన పార్టీ కార్యకర్తలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గుంతకల్ నియోజకవర్గం జనసేన బాధ్యుడు వాసగిరి మణికంఠ సూచనలతో, జనసేన కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సింగపూర్‌లో మంగళవారం చోటు చేసుకున్న స్కూల్ అగ్నిప్రమాదంలో జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఆయన చేతులు, కాళ్లకు గాయాలయ్యాయని తెలిసింది. ప్రస్తుతం మార్క్ శంకర్ సింగపూర్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన నేపథ్యంలో, గుంతకల్ హనుమాన్ సర్కిల్ వద్ద ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో జనసైనికులు భగవంతుడిని ప్రార్థిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని, పవన్ కళ్యాణ్‌కు ఈ సమయంలో ధైర్యంగా ఉండేందుకు శక్తిని ప్రసాదించాలని వారు భగవంతుణ్ణి వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ గుంతకల్ పట్టణ అధ్యక్షుడు బండి శేఖర్, చిరంజీవి యువత అధ్యక్షుడు పాండు కుమార్, వీరమహిళ ఈరమ్మ, సీనియర్ నాయకులు గాజుల రాఘవేంద్ర, కథలవీధి అంజి, పామయ్య, సుబ్బయ్య, దాదు, వెంకటేష్, పెంచల్, శ్రీరామ్, నాని, విజయ్, లారెన్స్, అమర్, అనిల్, రైల్వే రాము, సునీల్, గంగాధర్, కళ్యాణ్, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Share this content:
Post Comment