తాడేపల్లిగూడెంలో మార్క్ శంకర్ కోసం ప్రత్యేక పూజలు

*తాడేపల్లిగూడెంలో 108 కొబ్బరికాయలతో మొక్కులు తీర్చిన బొలిశెట్టి సేవా సమితి

తాడేపల్లిగూడెం: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదల పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని తాడేపల్లిగూడెం గ్రామదేవత శ్రీ బలుసులమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని బొలిశెట్టి సేవా సమితి ఆధ్వర్యంలో శుక్రవారం నాడు ఘనంగా నిర్వహించారు. మద్దాల నరసింహ, కేశవభట్ల విజయ్ తదితర మిత్రులు ఆలయంలో 108 కొబ్బరికాయలు కొట్టి అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ, సింగపూర్ అగ్ని ప్రమాదంలో గాయపడిన పిల్లలతో పాటు మార్క్ శంకర్ కూడా ప్రమాదం నుంచి బయటపడ్డారని, ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. ఈ విషాద సమయంలోనూ పవన్ కళ్యాణ్ తమ పర్యటనను కొనసాగిస్తూ, నాయకత్వాన్ని చాటుకున్నారని ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా బొలిశెట్టి సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తాడేపల్లిగూడెం శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ తనయుడు బొలిశెట్టి రాజేష్ హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బొలిశెట్టి రాజేష్, తోట రాజ్, ఆలయ నిర్వాహకులు శ్రీరంగ అంజి, బొలిశెట్టి సేవా సమితి సభ్యులు లింగం శ్రీను, మద్దాల నరసింహ, కేశవభట్ల విజయ్, రౌతు సోమరాజు, మట్టి బాబ్జి, రావూరి రమేష్, నీలం సురేష్, సుంకర ధనబాబు, నీలపాల దినేష్, బైనపాలెపు ముఖేష్, యాజ్జాడ అనిల్, మద్దాల వీరు, చొప్ప లక్ష్మణ్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Share this content:

Post Comment