- గుంటూరులో శ్రీ వీరాంజనేయ స్వామికి ప్రత్యేక అర్చనలు నిర్వహించిన జిల్లా జనసేన అధికార ప్రతినిధి ఆళ్ళ హరి
అంతరిక్ష పరిశోధకురాలు సునీతా విలియమ్స్ అంతరిక్షం నుంచి భూమి మీదకు క్షేమంగా రావాలంటూ జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి ఆధ్వర్యంలో శ్రీనివాసరావుతోటలోని శ్రీ వీరాంజనేయస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరికొన్ని గంటల్లో భూమి మీదకు చేరుకోనున్న సునీతా విలియమ్స్, విల్మోర్ ప్రయాణంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా గమ్యాన్ని చేరుకోవాలని మూలవిరాట్ ఆంజనేయస్వామికి సునీతా విలియన్స్ పేరు మీద పూజారి పవన్ కుమార్ ప్రత్యేక అర్చన చేశారు. ఈ సందర్భంగా ఆళ్ళ హరి మాట్లాడుతూ ఐదు రోజుల పరిశోధన కోసం అంతరిక్షం చేరుకున్న సునీతా విలియమ్స్ బృందానికి అనుకోని అవాంతరాలు ఏర్పడటంతో సుమారు తొమ్మిది నెలల పాటు అంతరిక్షంలోనే ఉండాల్సి వచ్చిందన్నారు. 288 రోజుల తరువాత ఆమె భూమి మీదకు చేరుకోవటానికి అన్ని ఏర్పాట్లు జరిగాయని ఈ ప్రయాణంలో ఎటువంటి సమస్యలు రాకూడదని కోరుకున్నారు. గతంలో ఎన్నోసార్లు అంతరిక్షంలోకి వెళ్లి వచ్చిన సునీతా విలియమ్స్ ఈసారి కూడా క్షేమంగా తిరిగి రావాలని ప్రపంచం అంతా కోరుకుంటుందని ఆళ్ళ హరి తెలిపారు. ఈ పూజా కార్యక్రమంలో కోలా అంజి, వడ్డె సుబ్బారావు, బియ్యం శ్రీను, తోట వెంకటేశ్వర్లు, జక్కా శివన్నారాయణ, సాయి తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment