జనసేనాని పేరు మీద ప్రత్యేక పూజలు

నాగర్ కర్నూల్ ప్రజా నాయకుడు, జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర యువజన అధ్యక్షులు, నాగర్ కర్నూల్ నియోజకవర్గ ఇంచార్జ్ వంగ లక్ష్మణ్ గౌడ్ సూచనల మేరకు నాగర్ కర్నూల్ నియోజకవర్గం, బిజినపల్లి మండలం, వట్టెం గుట్టపై ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా, ప్రత్యేక పూజలు చేయించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో
నాగర్ కర్నూల్ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు మహేష్ గౌడ్, భాస్కర్, సూర్య, వంశి రెడ్డి, రాజు నాయక్, మహేష్, విజయ్, సతీష్, భాను, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.