శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో పవన్, వారాహి పేరిట ప్రత్యేక పూజలు

బెంగుళూరు: జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జూన్ 14వ తేదీన తలపెట్టిన వారాహి యాత్ర జయప్రదం కావాలని, అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పేరిట జనసేన బెంగళూరు, బసవనపురంలోని శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడము జరిగినది. జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఎల్లప్పుడూ సకల శుభాలతో, ఎలాంటి అడ్డంకులు ఎదురైనా అధిగమించే శక్తిసామర్థ్యాలు కలిగిన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి శ్రీ ఆంజనేయస్వామి ఆశీస్సులు తోడైతే ఇక ఎదురు ఉండదనీ అందరూ మనస్పూర్తిగా ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో రాజేష్ కుమార్ రాయల్, మధు కుమార్, ఐటి ఇంచార్జీ కుప్పం నియోజకవర్గం సురేష్, పవన్ కుమార్ రాయల్, వీబీ రావు, మురళి రాయల్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.