శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో పవన్ కళ్యాణ్ పేరిట ప్రత్యేక పూజలు

మంగళవారం, శ్రీకాకుళం జిల్లా, పాలకొండ నియోజక వర్గం, వీరఘట్టం మండలం, నడుకురు గ్రామంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో పవన్ కళ్యాణ్ పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మత్స పుండరీకం మాట్లాడుతూ వారాహి అంటే దుష్టులను శిక్షించేది అని అర్థం అందుకే వైస్సార్సీపీ నాయకులు భయపడుతున్నారు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అది పవన్ కళ్యాణ్ చేసే వారాహి బస్ యాత్ర తో సాధ్యం అవుతుంది అని పుండరీకం తెలిపారు. ఉభయ తెలుగు రాష్ట్రాల బంగారు భవిష్యత్తు కోసం జనసేన పోరాటం చేస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో కొండగట్టులో వారాహి వాహనంకి పూజ జరిగిన సమయంలో ఇక్కడ ప్రత్యేక పూజ జరిపామని, అదేవిధంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చేపట్టబోయ వారాహి బస్ యాత్ర విజయవంతం కావాలని అభయ ఆంజనేయ స్వామిని కోరుకున్నామని మత్స పుండరీకం తెలిపారు. ఈ కార్యక్రమంలో చింత గోవర్ధన్, కలిపిల్ల సింహ చలం, వాన కైలాష్ తదితరులు పాల్గొన్నారు.