సింగపూర్ టుమాటో స్కూల్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడ్డ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు కొణిదెల మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని జిల్లా జనసేన అధికార ప్రతినిధి ఆళ్ళ హరి ఆధ్వర్యంలో శ్రీనివాసరావుతోటలోని శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆలయ పూజారి పవన్ కుమార్ కొణిదెల మార్క్ శంకర్ పేరుమీద ఆంజనేయస్వామికి ప్రీతికరమైన ఆకు పూజ, సింధూర పూజలను చేసారు. ఈ సందర్భంగా ఆళ్ళ హరి మాట్లాడుతూ ఎప్పుడూ దేశం బాగుండాలని, సమాజం బాగుండాలని, పదిమంది మంచికోరే పవన్ కళ్యాణ్ ఇంట ఇలా జరగటం బాధాకరమన్నారు. కష్టాల్లో ఉన్నవారిని, సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నవారిని ఆదుకోవటంలో ఎప్పుడూ ముందుండే మెగా ఫ్యామిలీలో ఇలాంటి ప్రమాదం జరగటం పట్ల ప్రజలు ఎంతో ఆవేదన, ఆందోళన చెందుతున్నారన్నారు. ప్రమాదంలో గాయపడ్డ మార్క్ శంకర్ ఆంజనేయస్వామి కృపతో పాటూ ప్రజల ఆశీస్సులతో త్వరలోనే పూర్తి ఆరోగ్యంగా తిరిగిరావాలని ఆళ్ళ హరి అభిలాషించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ కార్యదర్శి తోట వెంకటేశ్వర్లు, మెహబూబ్ బాషా, కోలా అంజి, వడ్డె సుబ్బారావు, నండూరి స్వామి స్టూడియో బాలాజీ, శివన్నారాయణ, మంత్రి లోకేష్, సాయి తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment