కళ్యాణదుర్గం జనసేన ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు

జనసేన పార్టీ అధినేత & ఏపీ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ రెండవ తనయుడు “మార్క్ శంకర్ పవనోవిచ్” సింగపూర్ లోని తను చదువుతున్న స్కూల్లో ఫైర్ యాక్సిడెంట్ ప్రమాదం జరిగి తన చేతులు కాళ్లకు గాయాలతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్న పరిస్థితుల్లో గురువారం కళ్యాణదుర్గం పట్టణంలోని సాయిబాబా గుడిలో కళ్యాణదుర్గం జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనసేన నాయకులు, వీరమహిళలు అందరూ కలిసి పవన్ కళ్యాణ్ రెండవ తనయుడు “మార్క్ శంకర్ పవనోవిచ్” పేరు మీద ప్రత్యేకంగా అర్చన మరియు పూజ కార్యక్రమంను నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ రెండవ తనయుడు మార్క్ శంకర్ బాబు త్వరగా కోలుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని, క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని కళ్యాణదుర్గం జనసేన నాయకులు, వీరమహిళలు అందరూ కలిసి భగవంతున్ని ప్రార్థించడం జరిగింది. ఈ పూజా కార్యక్రమంలో కళ్యాణదుర్గం నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ బాల్యం రాజేష్, జనసేన జిల్లా కార్యదర్శి లక్ష్మీ నరసయ్య, జనసేన ముఖ్య నాయకులు గంగరాజు, కంబదూరు మండల ఉపాధ్యక్షులు కదిరిదేవరపల్లి వెంకటేష్, జనసేన నాయకులు మల్లాపురం అనిల్ కుమార్, లక్ష్మంపల్లి లక్ష్మణ్, కళ్యాణదుర్గం నవీన్ కుమార్, రుహుల్ల, జనసేన వీరమహిళ కదిరిదేవరపల్లి శ్రావణి తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment