నేటి నుండీ తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు

తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నేడు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు మొదలవనున్న ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ చట్టాల్లో సవరణలతో పాటు రెవెన్యూ చట్టంలో హైకోర్టు సూచించిన సవరణలను ముందుగా మంగళవారం శాసన సభలో ప్రవేశ పెట్టనున్నారు. అనంతరం శాసన సభ వాటికి ఆమోదం తెలపగానే అవే బిల్లులను బుధవారం శాసన మండలిలో ప్రవేశ పెట్టనున్నారు. అలాగే వ్యవసాయ భూమి ఇతర అవసరాలకు వినియోగం, సీఆర్పీసీ, బిల్లులపైనా చర్చ చేపట్టనున్నారు. ఎలాంటి ప్రశ్నోత్తరాలు లేకుండా నేరుగా బిల్లులపై చర్చ జరుగనుంది. కోవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా సభలో ఏర్పాట్లు చేశారు.