జనసేన కుటుంబ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు: డా.వంపూరు గంగులయ్య

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో నిబద్ధత, నిజాయితీ, కార్యదక్షతతో కూడిన నాయకత్వాన్ని నిర్మించడమే తమ ప్రధాన లక్ష్యమని ఎప్పుడూ చెప్పుకుంటారు. శుక్రవారం పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడ గ్రామంలో జరిగిన జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవానికి రాష్ట్ర నలుమూలల నుండి తరలి వచ్చిన జనసేన కుటుంబ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే, అరకు పార్లమెంట్ పరిధిలోని 7 గిరిజన నియోజకవర్గాలకు హాజరైన జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, వీరమహిళలకు అభినందనలు తెలుపుతున్నాము. మన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్రీయ రాజకీయాలలో ఎన్నో విమర్శలు, అవహేళనలకు గురై ధైర్యంతో ముందుకు సాగి, నవతరం రాజకీయాలకు దార్శనికతను అందించారు. ఆయన చూపిన ధైర్యంతో నేటి యువ నాయకులు రాజకీయాల్లో కీలకమైన పాఠాలు నేర్చుకుంటున్నారు. ఆయన ఆకాంక్ష యువతే నాయకత్వంలో ముందుండాలని, ఆయన నాయకత్వాన్ని అనుసరించి, మన భవిష్యత్ తరాలకు నిజాయితీతో కూడిన నాయకత్వం అందించడమే మన లక్ష్యం. పాడేరు నియోజకవర్గం నుండి మీరు గిరిజన ప్రజలకు హితమైన రాజకీయాలను అందించడంలో ప్రముఖులు కావాల్సిన అవసరం ఉంది. మన రాష్ట్ర రాజకీయాలపైనా, దేశంలోని గిరిజనుల శ్రేయస్సుపైనా కదిలే విధానం మరచిపోకూడదు. ఈరోజు నాయకత్వం పదవుల కోసం కాదు, గిరిజన ప్రజలకు మార్గదర్శకమైన ఆలోచనతో కూడిన నాయకత్వం అందించడమే ప్రధాన లక్ష్యం. మన జనసేన పార్టీ నాయకుడు, సమాజహితానికి అంకితంగా ఉండి, విశ్వాసం, శక్తి, ఆత్మస్థైర్యం, మర్యాదతో నిండిన నాయకత్వం అందించడం, ఇది యువతకు కావలసిన మార్గమని పాడేరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి డా.వంపూరు గంగులయ్య అన్నారు.

Share this content:

Post Comment