వడెరపాలెంలో ఆత్మీయ సమావేశం

సత్తెనపల్లి, భృగుబండ గ్రామం వడెరపాలెంలో సత్తెనపల్లి నియోజకవర్గ జనసేనపార్టీ ఇంచార్జ్ బొర్రా అప్పారావు ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా అప్పారావు మాట్లాడుతూ నా విద్యాబ్యాసం ఈ గ్రామాల్లోనే జరిగింది. భృగుబండ గ్రామంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కలిపిస్తా అన్ని హామీ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వంతో పని లేదు మీరు అంతా నా కుటుంబ సభ్యులు మీ కష్టాలలో కూడా పాలుపంచుకుంటా అభివృద్ధికి తోడుపడతాన్ని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో మండల అధ్యక్షులు నాదెండ్ల నాగేశ్వరరావు సత్తెనపల్లి ఏడవ వార్డు కౌన్సిలర్ రంగిశెట్టి సుమన్, చిలకా పూర్ణ, స్థానిక నాయకులు ఇంకొల్లు శివ, గుంజి నాగరాజు, అచ్చంపేట నాగరాజు, వీరభద్రయ్య బొజ్జ రామకృష్ణ, గుంజి శ్రీను, వెంకటయ్య కుంచల రమణయ్య వేముల వెంకటేశ్వర్లు తులవ సాంబశివరావు తదితర ప్రముఖులు పాల్గొన్నారు.