గూటాలలో జనసేనపార్టీ గ్రామకమిటీ నిర్మాణం కోసం ఆత్మీయ సమావేశం

పోలవరం నియోజకవర్గం పోలవరం మండలం గూటాల గ్రామంలో ఇంచార్జ్ చిర్రి బాలరాజు ఆదేశాల మేరకు మండలాద్యక్షులు గుణపర్తి వీరవెంకట సత్యనారాయణగారు(చిన్ని) మరియు జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యులు ఆటపాకల వెంకటేశ్వరరావు ఏవి సమక్షంలో గ్రామకమిటీని వేయడం జరిగింది. అలాగే జనసేన సిద్దాంతాలు విధానాలు నచ్చి పలువురు ఇతర పార్టీలనుండి వచ్చి మండలాద్యక్షులు సమక్షంలో జనసేన పార్టీలో జాయిన్‌ అయ్యారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాద్యక్షులు కురసం రమేష్‌, తెలగంశెట్టి రాము, ప్రధాన కార్యధర్శి చీకట్ల సాయికృష్ణమూర్తి, సిద్దన రామకృష్ణ మరియు గ్రామ జనసైనికులు పాల్గొన్నారు.