రొద్దం మండల జనసైనికుల ఆత్మీయ సమావేశం

రొద్దం మండల జనసేన పార్టీ ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు యూ. గంగాధర అధ్యక్షతన రొద్దం మండల జనసైనికుల ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రొద్దం మండలంలోని అన్ని పంచాయితీల గ్రామాల జనసైనికులు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండలంలో జనసేన పార్టీ బలోపేతం గురించి చర్చించడం జరిగింది. జనసైనికులు మండల నాయకుల అందరి సలహాలు సూచనలు తీసుకొని రాష్ట్రంలో రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఏ విధంగా జనసేన పార్టీని ముందుకు తీసుకువెళ్ళాలి మరియు మండలంలో పల్లెలో ఏమి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలో చర్చించడం జరిగింది. అ తర్వాత రొద్దం నుంచి నేరుగా కొగిర గ్రామంవరకు భారీ ర్యాలీ నిర్వహించి తర్వాత అదే గ్రామంలోని వీధుల్లో పాదయాత్ర చేయడం అలాగే జనసేన నినాదాలతో గ్రామం మొత్తం హోరేత్తించడం జరిగింది. ఈ కార్యక్రమాలలో పాల్గొన్నటువంటి జనసైనికులకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.