స్పోర్ట్స్ ఫెడరేషన్ కు సహాయం చేయాలి

విజయవాడ: పేద విద్యార్థులకు ఉపయోగపడే స్పోర్ట్స్ ఫెడరేషన్ కు మున్సిపల్ కార్పొరేషన్ సహాయం చేయాలని జనసేన రాష్ట్ర నాయకులు మరియు 40వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి, న్యాయవాది ఎం.హనుమాన్ కోరారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత 2 సంవత్సరం నుంచి ఎంతోమంది పేద విద్యార్థుల్ని ఉచితంగా కరాటి, క్రికెట్, కబాడీ లాంటి స్పోర్ట్స్ శిక్షణ అందిస్తుంది భగత్ సింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా.. ఇలాంటి సంస్థలకు మున్సిపల్ కార్పొరేషన్ ఎందుకు స్థలం కేటాయించడం లేదు. వైసిపి కార్పొరేటర్లు అవినీతి చేయడానికి భూకబ్జా చేయడానికి మున్సిపల్ కార్పొరేషన్ ఒప్పుకుంటుంది గాని పేద విద్యార్థులకు చదువులో భాగమైన క్రీడలను ప్రోత్సహించే స్పోర్ట్స్ ఫెడరేషన్ కు మాత్రం ఎందుకు సెంటు భూము కూడా కేటాయించలేకపోయింది. స్థానిక విజయవాడ మున్సిపల్ కమిషనర్ గారికి కార్పొరేటర్లు ఎమ్మెల్యేలు వైసీపీ నాయకులు మున్సిపల్ తాలూకా కబ్జా చేస్తుంటే మాత్రం దాని గురించే ప్రస్తావని తీసుకురారు. కనీసం పశ్చిమ నియోజకవర్గంలో కొన్ని డివిజన్లో కనీసం త్రాగునీరు సదుపాయం కూడా కల్పించలేని వైసీపీ ప్రభుత్వం ఎందుకు?? మున్సిపల్ కార్పొరేషన్ తక్షణమే ఆ ఒక్క స్పోర్ట్స్ ఫెడరేషన్ మున్సిపల్ స్థలం లీజు కేటాయించాలని. దానివల్ల ఎంతోమంది పేద విద్యార్థులకు స్పోర్ట్స్ అనే ఉన్నత విద్యని అంద చేయవచ్చు అని భావిస్తూ మున్సిపల్ కమిషనర్ గారిని వాళ్లకి తగినంత స్థలం కేటాయించవలసిందిగా కోరుతున్నాను.