సారె జనసేవా చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడిని సత్కరించిన శ్రీఖరి పౌండేషన్

మహబూబ్ నగర్, సిందూజ త్రిస్టార్ హోటల్లో శ్రీఖరి పౌండేషన్ వారు శ్రీఖరి ఉగాది పురస్కార్ 2022 నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొమరోలు మండల జనసేన పార్టి అధ్యక్షుడు, సారె ఓబులేసు నాయుడును సతీ సమేతముగా ఘనంగా సత్కరించి ఉగాది పురస్కార్ ప్రధానం చేసారు. ఈ సందర్భంగా సారె ఓబులేసు నాయుడు మాట్లాడుతూ.. 400 మందిలో మన సేవలు గుర్తించి.. ఈ ఉగాది పురస్కార్ ప్రధానం చేయడం పై సంతోషం వ్యక్తం చేశారు.