శ్రీ లక్ష్మి గణపతి స్వామి వారి లడ్డు ప్రసాదాలు వేలం

అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం 9వార్డు నల్లా గార్డెన్ శ్రీ లక్ష్మి గణపతి ఆలయం వద్ద నల్లా వెంకటరమణ – సత్యవేణి దంపతులు స్వామి వారికి సమర్పించిన 10 కేజిల లడ్డు ప్రసాదం నూకల షణ్ముఖరావు రూ.27027/కు వేలం పాటలో పాడుకున్నారు. ఎమ్ కోటేశ్వరావు-సీతా మహాలక్ష్మి దంపతులు స్వామి వారికీ ప్రసాదంగా ఇచ్చిన 5 కేజిల లడ్డు ను రూపాయలు 7100/- కు నల్లా సత్యనారాయణ పాడుకున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన కౌన్సిలర్ గోలకోటి విజయలక్ష్మి, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.