మహాశివరాత్రి సందర్భంగా గుంతకల్ పట్టణం, వాల్మీకి నగర్ జనసేన శ్రేణుల ఆత్మీయ ఆహ్వానం మేరకు సరస్వతీ విద్యా మందిర్ స్థానిక రైల్వే బ్రిడ్జ్ దగ్గర వెలిసిన శ్రీ శ్రీ శ్రీ మకర లింగేశ్వర స్వామిని ప్రత్యేకంగా దర్శించుకున్న గుంతకల్ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయబాధ్యుడు వాసగిరి మణికంఠ. అనంతరం ఆయన గౌరవ ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి వర్యులు కొణిదెల శ్రీ పవన్ కళ్యాణ్ ఆరోగ్యం మరియు కూటమి ప్రభుత్వంలో ప్రజలందరికీ మంచి జరగాలని లింగార్చన చేసి అనంతరం నిర్వాహకులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని, కార్మికులు ఎంతో శ్రమించి వారి సృజనాత్మకతతో రూపుదిద్దిన మహా శివలింగం అద్భుతం అని నిర్వాహకులను, కార్మికులను అందరినీ పేరుపేరునా అభినందించారు. రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం ద్వారా స్థానిక ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సహకారంతో శ్రీ మకర లింగేశ్వర స్వామి అనుగ్రహంతో ఆలయా ధూప దీప నైవేద్యానికి, దేవాలయం అభివృద్ధికి తోడ్పాటును అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వాల్మీకి నగర్ కాలనీవాసులు, రాడ్ బెండర్ కార్మికులు మరియు దేవాలయ కమిటీ సభ్యులు భి . సుధాకర్, కావాలి బంగారు నాయుడు , భి. సుధాకర్, భి. లక్ష్మణ్, కావాలి జనార్ధన్ నాయుడు, బొగేశ్, పూజారి మల్లయ్య, ఎంపి తేజేశ్వర్, వాల్మీకి రంగా జనసేన పార్టీ జిల్లా కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యుడు పవర్ శేఖర్ జనసేన సీనియర్ నాయకులు కసాపురం నందా, గాజుల రాఘవేంద్ర, కథల వీధి అంజి, సుబ్బయ్య, అమర్, విజయ్ మైనార్టీ నాయకుడు దాదు, లారెన్స్, హరీష్ తదితరులు పాల్గొన్నారు.

Share this content:
Post Comment