అరకు నియోజకవర్గం, పెదబయలు మండలంలోని గాసాబు గ్రామంలో స్థానిక గ్రామస్తుల ఆహ్వానంతో శ్రీశ్రీశ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జనసేన పార్టీ పాడేరు అసెంబ్లీ మరియు అరకు పార్లమెంట్ ఇంచార్జ్ డా. వంపూరు గంగులయ్య మరియు వారి కుటుంబ సభ్యులను గ్రామస్తులు గిరిజన సంప్రదాయాల మేరకు ఘనంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో మాట్లాడిన డా. వంపూరు గంగులయ్య, శ్రీరామ నవమి రోజు ప్రతి ఇంట్లో సీతారామ భరత శతృఘ్న విగ్రహాలు లేదా శ్రీరామ పట్టాభిషేక పటమును ప్రతిష్టించి, పూజా మందిరంలో లేదా పీఠంపై పసుపు పీట వేసి కుంకుమతో అలంకరించి, పీట మధ్యన అష్టదళ పద్మం రాసి, దానిపై బియ్యాన్ని పరచి, కలశాన్ని నిలిపి, నవగ్రహాలు, దిక్పాలకులు సహా దేవతల పూజ నిర్వహించాలన్నారు. రామాష్టోత్తరము, సీతాష్టోత్తరము, అంజనేయాష్టోత్తరము, శ్రీసూక్తం, పురుష సూక్తం, విష్ణుసహస్రనామ పారాయణ చేయాలని, రామసహస్రనామ పూజను నిర్వహించాలని సూచించారు. రామనామాన్ని ఉచ్చరించేటప్పుడు పాపాలు నాశనం అవుతాయన్న ఆధ్యాత్మిక భావనను వివరించారు. పెద్ద పందిళ్ళతో పాటు ఇళ్లలో కూడా వడపప్పు, పానకం నైవేద్యంగా సమర్పించి పంచాలన్నారు. గిరిజన ప్రజల కష్టాలు తొలగించాలని, వారిపై శ్రీ సీతారాముల ఆశీస్సులు ఉండాలని, రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్న జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై దేవతల కృప ఎల్లప్పుడూ ఉండాలని కోరుతూ, ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పాడేరు మండల నాయకులు మజ్జి సంతోష్, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, జనసైనికులు, జనసేన శ్రేణులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment