రాజంపేట, సిద్దవటం మండలంలోని ఉప్పరపల్లి గ్రామంలో శ్రీరామనవమి పండుగ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య కడప-చెన్నై జాతీయ రహదారిలో సీతారాముల చిత్రపటానికి పూలమాల వేసి పూజలు చేసి భక్తిని చాటారు. అనంతరం ఒంటిమిట్ట కోదండ రామయ్య దర్శనానికి వెళ్లే భక్తులకు పానకము,వడపప్పు, ప్రసాదాలను పంచిపెట్టారు. రాముల వారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని రాటాల రామయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దకోట్ల శివాజి, జింకా పాములేటి ప్రసాద్, వినయ్, రాజా తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment