శ్రీ సింధూపురాణి అమ్మవారి చల్లదనం మహోత్సవం

*మహోత్సవంలో పాల్గొన్న జనసేన నేత దాసరి రాజు

సీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలోని కవిటి మండలం కుసుంపురం పంచాయతీలో మంగళవారం ఘనంగా నిర్వహించిన శ్రీ శ్రీ శ్రీ సింధూపురాణి అమ్మవారి చల్లదనం మహోత్సవం సందర్భంగా జరిగిన అమ్మవారి ఊరేగింపులో ఇచ్చాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ మరియు రాష్ట్ర యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ దాసరి రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన భక్తులతో కలిసి అమ్మవారికి నమస్సులు అర్పించి, గ్రామస్థులతో ఆత్మీయంగా మమేకమయ్యారు. స్థానికుల ఆహ్వానానికి స్పందిస్తూ, తమ సంప్రదాయాలను నిలుపుకోవడంలో భాగంగా జరిగే ఇటువంటి మహోత్సవాలు గ్రామీణ సంస్కృతికి నిదర్శనమని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు జనసేన నాయకులు, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొని వేడుకను మరింత ఉత్సాహభరితంగా మార్చారు.

Share this content:

Post Comment