రాజంపేట పార్లమెంటు జనసేన పార్టీ ఇంచార్జ్ యల్లటూరు శ్రీనివాస రాజు ఆధ్వర్యంలో నందలూరు మండలం, ఎగువకుమ్మరపల్లెలోని శ్రీ సీతారామాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగవైభవంగా నిర్వహించబడింది. ప్రతి ఏడాది రామనవమి రోజున జరిపే ఈ మహోత్సవాన్ని, ఈ సంవత్సరం ఏప్రిల్ 6 (ఆదివారం) నాడు పెద్ద ఎత్తున నిర్వహించారు. ఉదయం అభిషేకం, తదుపరి కళ్యాణ మహోత్సవం భక్తిశ్రద్ధలతో సాగాయి. ఈ కార్యక్రమానికి స్థానికులు మరియు చుట్టుపక్కల గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. భక్తులకు అన్నప్రసాదాన్ని స్వయంగా యల్లటూరు శ్రీనివాస రాజు ఏర్పాటు చేసి, పునీతమైన సేవగా నిలిచారు. భక్తులు ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
Share this content:
Post Comment