శ్రీశ్రీశ్రీ మందాలమ్మ తల్లి అమ్మవారి ప్రథమ వార్షికోత్సవ వేడుకలో భాగంగా ఆలయం వ్యవస్థాపకులు మంచెం శివ సత్యనారాయణ మూర్తి దంపతులను ఆలయ కమిటీ సభ్యులు నీటి సంఘం అధ్యక్షులు నల్లా సత్యనారాయణ, గొల్లవిల్లి పంచాయతీ సభ్యులు మద్దింశెట్టి సీతారామ స్వామి, మారిశెట్టి రాముడు, ఉప్పలగుప్తపు ఈశ్వరరావు, వానపల్లి నాగభూషణం, వీరవల్లి చినబాబు, యెరుబండి రాంబాబు, మంచెం మైనర్ బాబు, మరియు ఉప్పలగుప్తం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అరిసెలు వెంకట ముసలయ్య, సలాది సత్తిబాబు, గొలకోటి సత్తిరాజు మరియు గ్రామ పెద్దలు, కూటమి నాయకులు ఘనంగా సత్కరించారు. శ్రీ భీమేశ్వర భజన సంఘం గొల్లవిల్లి వారిచే “భజన కార్యక్రమం” నిర్వహించారు. వానపల్లి నాగభూషణం గారి కుమార్తె రమాదేవి గారి ధనసహాయం తో బాణాసంచా, దేవరపల్లి శ్రీనివాసరావు ధనసహాయంతో గుడి పూల అలంకరణ, దాతల సహకారంతో భారీ అన్నసమారాధన జరిగింది. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ఆడపడుచులు, గ్రామ యువత, భక్తులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment