వైభవంగా శ్రీ శ్రీ శ్రీ సుబ్బాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు

అమలాపురం పట్టణం మెయిన్ రోడ్డులో కొలువుతీరిన శ్రీ శ్రీ శ్రీ సుబ్బాలమ్మ అమ్మవారి జాతర, తీర్థ మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. అమ్మవారిని నిలబెట్టిన అనంతరం ఉగాది పర్వదినానికి ముందు జాతరలు నిర్వహించడం ఆనవాయితీ. ఉగాది పర్వదినంనాడు ఆలయం వద్ద తీర్థ మహోత్సవం జరుగుతుంది. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అమ్మవారి ఆలయానికి సమీపంలో కాయగూరల మార్కెట్ వద్ద అమ్మవారి సోదరీమణులు శ్రీ నూకాలమ్మ, శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారి ఆలయాలు ఉన్నాయి. అలాగే, శ్రీ శ్రీ శ్రీ సుబ్బాలమ్మ అమ్మవారి పూర్వపు ఆలయం కూడా మార్కెట్‌కు కొద్దిదూరంలో ఉంది. పౌరాణిక కథనాల ప్రకారం, అమ్మవారు గారపాటి వంశీయుల ఆడపడుచుగా విశ్వసించబడుతున్నారు.

Share this content:

Post Comment