అమలాపురం గ్రామ దేవత శ్రీ శ్రీ శ్రీ సుబ్బాలమ్మ అమ్మవారి సారె యాత్ర 28వతేదీ శనివారం నాడు జరగనుంది. ఈ అమలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వద్ద నుండి వెచ్చా వారి అగ్రహారం శ్రీ కనకదుర్గమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకుని శ్రీ చెన్న మల్లేశ్వర స్వామి దేవాలయం వద్ద నుండి కల్వకొలను వీధి వేప చెట్టు వద్ద శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి దర్శించుకుంటారు. అక్కడ నుండి వంటెద్దు వారి వీధి శ్రీ గనికమ్మ అమ్మవారిని దర్శించుకుని నల్లా వీధి శ్రీ విజయ దుర్గ అమ్మవారిని దర్శించుకుని గండు వీధి శ్రీ శేషశయన దేవాలయం వద్దకు చేరుకుంటుంది. అక్కడ నుండి గారపాటి వీధి (పాత పైర్ స్టేషన్) శ్రీ కనకదుర్గమ్మ తల్లి దేవాలయం వద్ద దర్శించుకుని రవణం వీధి శ్రీ మహిషాసుర మర్థిని అమ్మవారిని దర్శించుకుని రవణం మల్లయ్య వీధి శ్రీ కోదండరామాలయం దేవాలయం నుండి శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారిని దర్శించుకుని బయలుదేరి శ్రీశ్రీ శ్రీ సుబ్బాలమ్మ అమ్మవారికి సారే కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని మహిళా తల్లులు నగర పెద్దలు అందరూ విజయవంతం చేయాలని సమరసత సేవా ఫౌండేషన్ నగర కన్వీనర్ అల్లపల్లి ముత్యాల రావు, అమలాపురం నగరం ఖండ ధర్మ ప్రచారక్ మేడిశెట్టి నాగభూషణం తెలిపారు.
Share this content:
Post Comment