మహేశ్ చేతుల మీదుగా ‘శ్రీదేవి సోడా సెంటర్’ ట్రైలర్ రిలీజ్!

సుధీర్ బాబు – ఆనంది జంటగా ‘శ్రీదేవి సోడా సెంటర్’ రూపొందింది. విజయ్ చిల్లా – దేవిరెడ్డి శశి నిర్మించిన ఈ సినిమాకి , కరుణకుమార్ దర్శకత్వం వహించాడు. గ్రామీణ నేపథ్యంలో సూరిబాబు – శ్రీదేవి అనే జంట మధ్య సాగే అందమైన ప్రేమకథ ఇది. ఈ సినిమాను ఈ నెల 27వ తేదీన థియేటర్లకు తీసుకురానున్నారు.

ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి మహేశ్ బాబు చేతుల మీదుగా ఒక ట్రైలర్ ను రిలీజ్ చేయించారు. ఒక్కసారిగా ఈ సినిమాపై అంచనాలు పెరిగేలా ఈ ట్రైలర్ ను కట్ చేశారు. ఇప్పటివరకూ సినిమాకి సంబంధించిన ఆటపాటలు  .. అల్లరి చూపిస్తూ వచ్చారు. కానీ ఈ సారి రొమాన్స్ తో పాటు యాక్షన్ .. ఎమోషన్ చూపించారు.

ప్రేమ .. పెళ్లి .. ఈ మధ్యలో పరువు సృష్టించే గొడవలు ఈ ట్రైలర్ లో చూపించారు. ప్రేమకి పెద్దలు ఎదురుతిరగడం .. కథానాయకుడు తన ప్రేమకోసం ఎంతకైనా తెగించడం ట్రైలర్ లో ఆవిష్కరించారు. డైలాగ్స్ కూడా బాగున్నాయి. కంటెంట్ చూస్తుంటే యూత్ ను .. మాస్ ను ఒక రేంజ్ లోనే ఆకట్టుకునేలా అనిపిస్తోంది.