నవంబర్ 4 నుంచి ఓటిటీ లో సందడి చేయనున్న… శ్రీదేవి సోడా సెంట‌ర్‌

ఒక‌ప్పుడు కొత్త సినిమాలు చూడాలంటే థియేట‌ర్స్ వెళ్లాల్సిందే. టీవీలోనే కొత్త సినిమా ప్రసారం కావాలంటే క‌నీసం ఆరునెలలు అయినా సమయం పట్టేది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయయాయి. ఏ సినిమా అయినా కొన్ని నెలల గ్యాప్‌లోనే ఓటీటీలో దర్శన మిస్తుండడం గమనార్హం. ఇప్పుడు ఇదే బాట‌లో ఓటీటీలో వ‌చ్చేందుకు శ్రీదేవి సోడా సెంట‌ర్ కూడా సిద్ధ‌మైంది.

క‌రోనా సెకండ్‌ వేవ్‌ అనంతరం థియేటర్లలో విడుదలైన చిత్రాల్లో ‘ శ్రీదేవి సోడా సెంటర్‌ ’ కూడా ఒకటి. ఈ చిత్రానికి ‘పలాస 1978’ ఫేం కరుణ కుమార్‌ దర్శకత్వం వహించగా… సుధీర్ బాబు, ఆనంది జంటగా నటించారు. ఆగస్టు 27 న విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. కాగా ఇప్పుడు ఈ చిత్రం త్వరలోనే ఓటిటీలో రిలీజ్ అవవ్బోతున్నట్లు తెలుస్తుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ‘జీ 5’ ఈ సినిమా స్ట్రీమింగ్ కానుందని తెలుస్తుంది. నవంబరు 4 నుంచి ఓటీటీలో అండబాటులోకి రానున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు దీనికి సంబంధించి ఒక పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు.

ప్రేమకు కులం అడ్డుగా మరిందా… ఓ తండ్రి త‌న పరువు కోసం ఎంతటి దారుణానికి ఒడిగట్టారు… అనేది ఈ మూవీ స్టోరీ. విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ఈ మూవీని నిర్మించారు. తన కులం కాని అమ్మాయిని హీరో ప్రేమిస్తే… తర్వాత జరిగి పరిణామాలు ఎలా ఉంటాయి అని చూపించారు. ఈ సినిమా  విమర్శకులు, ప్రేక్షకులు నుంచి మంచి స్పందన సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

sudheer babu sridevi soda center movie ott release from november 4