మార్క్ శంకర్ కోలుకోవాలని శ్రీకాకుళం జనసేన నేతల ప్రత్యేక హోమాలు

గురువారం, వాండ్రంగి జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, జనసేన ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు మరియు రాష్ట్ర కార్యదర్శి పిసిని చంద్రమోహన్ వాండ్రంగి గ్రామంలోని శ్రీనివాసానంద స్వామీజీ ఆశ్రమంలో ప్రత్యేక హోమాలు నిర్వహించారు. శ్రీ శ్రీ శ్రీ సీతారాముల కల్యాణమండప ప్రారంభోత్సవ సందర్భంలో ఈ పూజా కార్యక్రమం జరిగింది. ఇటీవల సింగపూర్ స్కూల్‌లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో మార్క్ శంకర్ కూడా బాధితుడవగా, ఆయన త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో ఏపీ గిరిజన కార్పొరేషన్ చైర్మన్ మరియు మాజీ మంత్రి కిడారి శ్రవణ్, జనసేన శ్రీకాకుళం జిల్లా ఉపాధ్యక్షులు బూపతి అర్జున్ కుమార్, సంయుక్త కార్యదర్శి కొంచాడ చిన్నంనాయుడు, నియోజకవర్గ నాయకులు రాపాక నాయుడు, మీసాల రవికుమార్, వేదపండితులు మరియు వివిధ ఆశ్రమాల స్వామీజీలు పాల్గొన్నారు. ఈ మహా యజ్ఞం సందర్భంగా మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని అందరూ ప్రార్థనలు చేశారు.

Share this content:

Post Comment