శ్రీకాకుళం సన్ రైజర్స్ వారి ఆధ్వర్యంలో మెగా దంత వైద్య శిబిరం

శ్రీకాకుళం, పెనసాం గ్రామం, జి.సిగడాం మండలంలో జేసీఇ శ్రీకాకుళం సన్ రైజర్స్ వారి ఆధ్వర్యంలో మెగా దంత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో ‘వి’ డెంటల్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డా. ఎం. జాన్ సుమారు 100 మందిని దంత పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డా. జాన్ మరియు జేసీఐ శ్రీకాకుళం సన్ రైజర్స్ ప్రెసిడెంట్ జేసీ సంతోష్ దూసి మాట్లాడుతూ దంత సమస్యలపై నిర్లక్ష్యం వద్దని తెలియజేశారు, ఈ కార్యక్రమంలో వి డెంటల్ హాస్పిటల్ ఎం.డి డా. ఎం జాన్, మార్కెటింగ్ మేనేజర్ వెంకటేష్, ఎగ్జిక్యూటివ్ మధుసూదన్ గ్రామ పంచాయతీ జనసేన నాయకులు తాలబత్తుల పైడిరాజు సింహాచలం, చంటి, సంతోష్ మరియు జేసీఐ సభ్యులు మరియు గ్రామ నాయకులు పాల్గొన్నారు. దంత వైద్య శిబిరం పెట్టినందుకు గ్రామ ప్రజలు సంతోషం తెలియచేసారు.