శ్రీకాళహస్తి నియోజకవర్గం, జనసేన పార్టీ ఏర్పేడు మండల కమిటీ నియామకం

శ్రీకాళహస్తి నియోజకవర్గం, ఏర్పేడు మండల అధ్యక్షులుగా కిరణ్ కుమార్ రామిశెట్టి ని అది వరకే పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నియమించడం విదితమే. పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు, పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆదేశాల మేరకు, జిల్లా అధ్యక్షులు డా.హరిప్రసాద్ సూచనల మేరకు ఏర్పేడు మండల కమిటీ సభ్యులను నియమించడం జరిగింది. మండల అధ్యక్షులు కిరణ్ కుమార్ అధ్వర్యంలో రేణిగుంట పట్టణంలోని పార్టీ కార్యాలయంలో మండల కమిటీ సభ్యులకు నియోజకవర్గ ఇన్చార్జి శ్రీమతి వినుత కోటా నియమకపత్రాలను అందించడం జరిగింది.