శ్రీకాళహస్తి నియోజకవర్గం నో మై కాన్స్టిట్యుఎన్సి 15వ రోజు

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కార దిశగా, పార్టీ బలోపేతం దిశగా నియోజకవర్గ ఇన్చార్జి శ్రీమతి వినుత కోటా ప్రారంభించిన నో మై కాన్స్టిట్యుఎన్సి కార్యక్రమంలో భాగంగా ఆదివారం శ్రీకాళహస్తి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ నుండి మార్కెట్ వరకు పర్యటించి ఇంటిన్టికి వెళ్లి ప్రజలను, మార్కెట్ లోని చిరు వ్యాపారులను పలకరించి వారి సమస్యలను తెలుసుకోవడం జరిగింది. నిత్యావసర వస్తువుల ధరలు, విద్యుత్ బిల్లులు, గాస్ ధరల పెంపు వల్ల సామాన్యులు ఇబ్బంది పడుతున్నామని, చిన్న వ్యాపారస్తులు తీవ్ర నష్టపోయామని, ప్రభుత్వం నుండి ఎలాంటి సహకారం ఇవ్వడం లేదని తెలిపారు. ఈ ప్రభుత్వానికి ఒక్క అవకాశం అని ఇచ్చి మోసపోయామని, రాబోయే ఎన్నికల్లో జనసేన అద్యక్షులు పవన్ కళ్యాణ్ కి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలిపారు. జనసేన పార్టీ తరఫున రాష్ట్ర స్థాయిలో నిత్యావసర ధరలు పెంపుకు సంబంధించి పోరాటం చేస్తామని ప్రజలకు బరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి పట్టణ అధ్యక్షులు భవాని శంకర్, నాయకులు మున్న, కరీం, ప్రమోద్,రఫీ, సురేష్, రవి కుమార్,చందు చౌదరి, సలీం, తేజా, అశోక్, ప్రేమ్, శీను, సర్దార్, నేతాజీ, జూలపాటి చందు, మహేష్, శేఖర్ రెడ్డి మరియు జనసైనికులు పాల్గొన్నారు.