పవన్ కళ్యాణ్ కి వరి ధాన్యాలతో, పాలతో అభిషేకం చేసిన శ్రీకాళహస్తి రైతులు

శ్రీకాళహస్తి, ఆత్మహత్య చేసుకుని చనిపోయిన రైతులకు 1లక్ష రూపాయలు ఆర్థిక సహాయం ప్రకటించి, చనిపోయిన రైతుల కుటుంబాలకు ధైర్యాన్ని ఇవ్వడం కోసం 5 కోట్ల రూపాయలు తన కష్టార్జితంను కేటాయించడంను హర్షిస్తూ, రైతుల గిట్టుబాటు ధర సమస్యల గురించి మాట్లాడిన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి ఈరోజు ముచ్చువోలు పంచాయతీలో శ్రీకాళహస్తి నియోజకవర్గ రైతులు, మహిళా కౌలు రైతులు నియోజకవర్గ ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా అధ్వర్యంలో పవన్ కళ్యాణ్ చిత్ర పటానికి వరి ధాన్యాలతో, పాలతో అభిషేకం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా రైతుకు న్యాయం జరగడం లేదు అని, ఏ అధికారం లేని పవన్ కళ్యాణ్ నేనున్నానని బరోసా ఇస్తూ లక్ష రూపాయలు ఆర్థిక సహాయం ఇవ్వడంపై రైతులు సంతోషం వ్యక్తం చేసి, పవన్ కళ్యాణ్ నాయకత్వం తోనే రైతుల సౌభాగ్యం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా రైతులకు అండగా నిలబడ్డారు పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చి టీడీపీ మాజీ సర్పంచ్ (రైతు) దద్దోలు రమణయ్య జనసేన పార్టీలో చేరారు. వినుత జనసేన కండువా వేసి రమణయ్య ని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు దండి రాఘవయ్య, నాయకులు గణేష్, హరి యాదవ్, లక్ష్మణ్ యాదవ్, వెంకటరామయ్య, జనసైనికులు పాల్గొన్నారు.